విశాఖ మత్స్యశాఖ అభివృద్ధి కార్యాలయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మత్స్య కార్మికుల సమస్యలపై సంబంధిత అధికారులుతో చర్చలు జరిపారు. ప్రధానంగా రింగ్ వలతో సాంప్రదాయ మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ విధానాన్ని నిలిపివేయాలని కోరారు.
రింగ్ వల విషయంపై నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేస్తుందని చెప్పారు.
ఇదీ చదవండీ: 'వైకాపా పాలన మూడు పథకాలు...ఆరు ఫలాలుగా సాగుతోంది'