విశాఖ జిల్లాలో కొవిడ్ టీకాను పంపిణీ చేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ ఇమ్యునైజేషన్ సమావేశం నిర్వహించారు. తొలిదశలో టీకాను ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎంఎన్లకు ఇస్తామని కలెక్టర్ చెప్పారు. రెండో దశలో 50ఏళ్లు పైబడిన వృద్ధులకు, మధుమేహం, బీపీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తామన్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితా తయారుచేయాలని, వ్యాక్సినేషన్ నిల్వపాయింట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈనెల 7వ తేదీన ఆయా అంశాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి..
బురేవి ప్రభావం.. నెల్లూరు, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు