Vizag Andhra Medical College Centenary Celebrations: విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ శతాబ్ది వేడుకలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశాఖను సీటి ఆఫ్ డెస్టినీ గా సంభోదిస్తూ.. ఆయన ప్రసంగం మొదలుపెట్టారు. విశాఖలో మెడ్ టెక్ జోన్ ఎన్నో హై టెక్ మెడికల్ ఎక్విప్మెంట్ అందిస్తోందని.. కేవలం మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే పరికరాలు అందిస్తున్నారని ప్రశంసించారు. వందేళ్ల మెడికల్ కాలేజ్ ప్రస్థానంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో గవర్నర్‌గా సేవలుఅందించినప్పుడు అక్కడ రెండు మెడికల్ కాలేజ్‌లు వందేళ్లు పూర్తి చేసుకున్నాయని అన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఈ శతాబ్ది వేడుకలు జరగడం ఆనందంగా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. మోదీ విధానాలను ప్రపంచం ప్రసంశిస్తోందిని తెలిపారు. ఢిల్లీ డిక్లరేషన్‌ను ప్రపంచం అభినందించిందన్న ఆయన .. ఆ స్పూర్తితోనే ప్రతి రాష్ట్రంలో జీ 20 సభలు, సమావేశాలను నిర్వహించామన్నారు. ఇండియా మూడో ఆర్థిక ప్రగతి దేశం అని జపాన్, చైనాలకు సమానంగా అభివృద్ధి అవుతోందని ఆయన చెప్పారు. మన దేశంలో ప్రతి వ్యక్తి వాడే తలసరి డేటా అమెరికా సగటు కంటే ఎక్కువగా ఉందని ధన్‌ఖడ్ అన్నారు. అవినీతి మానవుని ఎదుగుదలను నాశనం చేస్తోందని అలానే మానవ వనరుల అభివృద్ధిని నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరు జవాబుదారీతనంగా ఉన్నారని అన్నారు. మన దేశం ఈ రోజు పక్క దేశాలకు మేలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఏఐ బహుళ ప్రచార్యంలోకి తీసుకొస్తూ.. దేశాభివృద్దికి ఉపయోగపడేలా అభివృద్ది చేస్తున్నామని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఎన్సీపీఐ డిజిటల్ శిక్షణ ఇచ్చి సాంకేతికతను పెంపొందిస్తున్నామని తెలిపారు. నాలుగు వేదాల్లో సైన్స్ ఉందని ఋగ్వేదం, యజుర్వేణవేదంలో వైద్యం కోసం చెప్పారని ఈ సందర్భంగా తెలిపారు. పూర్వ విద్యార్థి సంఘాలు, సంస్థ అభివృద్ధిలో భాగస్వాములుగా నిలిచారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ దేశంలో ఏడో అతి పురాతన మెడికల్ కాలేజ్ అని అన్నారు. ఈ రోజున కేజీహెచ్ సుమారు 2 వేల మంది రోగులకు సేవలు అందిస్తోందని అన్నారు. దేశంలో బెస్ట్ మెడికల్ స్కూల్ అని సుమారు 10 వేల మంది వైద్యులు ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి ప్రపంచంలో అనేక చోట్ల సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రతి ఏటా 25 వేల మంది బయటకు వెళ్లి వైద్య విద్య చదువుతున్నారని.. ఈ పరిస్థితిలో మరిన్ని వైద్య విద్యా సీట్లు పెంచాలని సూచించారు. దేశంలో వైద్యులు, రోగుల నిష్పతి 1:1007 గా ఉందని.. కనుక వైద్యులను పెంచాలని అన్నారు. ఇండియన్ హెల్త్ కేర్ రంగం అభివృద్ధిలో నడుస్తోందని.. ప్రస్తుతం వైద్య విద్యలో పరిశోధనలు ఇంకా పెంచాలని కోరారు.