ETV Bharat / state

'తితిదేలో అన్యమతస్థుల డిక్లరేషన్ తప్పనిసరి చేయాలి' - vishwa hindu parishad protest at visakhapatnam

తితిదేలో అన్యమతస్థులు దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ సంప్రదాయాలపై ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... విశాఖలోని డాబా గార్డెన్స్ జంక్షన్​లో విశ్వ హిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు... నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

vishwa hindu parishad protest against kodali nani at visakhapatnam
టీటీడీలో అన్యమతస్థుల దర్శనానికి డిక్లరేషన్ తప్పనిసరి చేయాలి
author img

By

Published : Sep 21, 2020, 5:10 PM IST

తిరుమల తిరుపతి, హిందువుల ఆరాధ్య ధైవం శ్రీవెంకటేశ్వర స్వామిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఖండించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ జంక్షన్​లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తితిదేలో అన్యమతస్థులు దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు.

దేవాలయం ప్రవేశానికి డిక్లరేషన్ అవసరం లేదని అనుచిత వ్యాఖ్యలు చేసిన వైవీ సుబ్బారెడ్డి... తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనలో అంతర్వేది ఘటన నుంచి ఏదో ఒక ప్రాంతంలో నేరుగా దేవాలయాలఫై దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్​ చేసింది.

ఇదీ చూడండి: కొడాలి వ్యాఖ్యలపై భాజపా మండిపాటు..క్షమాపణకు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.