ETV Bharat / state

సింహగిరిపై ఆభరణాల తనిఖీ.. అనుమతించకపోవడంపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం - visakha latest news

సింహగిరిపై కొనసాగుతున్న ఆభరణాల తనిఖీ... గోప్యంగా చేస్తుండడంపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. తనిఖీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఈవో సూర్యకళను కోరినా తమను అనుమతించకపోవడంపై విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి పూడిపెద్ది శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం
విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం
author img

By

Published : Jul 31, 2021, 10:29 AM IST

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామి దేవస్థానంలో దేవాదాయశాఖ అధికారులు చేపట్టిన ఆభరణాల తనిఖీ కొనసాగుతోంది. దేవాదాయశాఖ అధికారి ప్రసాద్, అప్రైజర్ శ్రీను ఆధ్వర్యంలో ఆలయంలోని ఆభరణాలను పరిశీలించారు. స్వామికి అలంకరించే బంగారు, వెండి వస్తువులతో పాటు.. ప్రాంగణంలోని అమ్మవార్లు, ఇతర దేవతామూర్తులకు అలంకరించే ఆభరణాలను తనిఖీ చేశారు.

ఈ తనిఖీలను స్వయంగా పరిశీలించేందుకు అవకాశం కల్పించాలని ఈవో సూర్యకళను కోరినా తమను అనుమతించలేదని విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి పూడిపెద్ది శర్మ పేర్కొన్నారు. ఎట్టకేలకు అనుమతించినా అప్పటికే తనిఖీలు పూర్తయ్యాయని ఆగ్రహించారు. దేవస్థానం అధికారులెవరూ లేకుండానే దేవాదాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టడం సరికాదన్నారు. తనిఖీలను గోప్యంగా జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సమగ్రంగా తనిఖీలు నిర్వహించి ఆభరణాల చిట్టాను భక్త సమాజానికి వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

Srisailam: శ్రీశైలానికి 5.59 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

చోరీకి యత్నించి.. విఫలమై వెళ్లిపోయిన దొంగలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.