విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు చేపట్టిన దీక్షలు 90వ రోజుకు చేరుకున్నాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ, కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో.. తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు.
స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల మిగిలిన వాటికి ఇది ఎంతో మార్గదర్శకంగా ఉందని కార్మికులు చెబుతున్నారు. ప్రపంచంలో.. విశాఖ స్టీల్ కి మంచి అదరణ ఉందని, నాణ్యమైన ఇనుము తయారీకి ఈ సంస్ధ పేరొందిందని కార్మికులు తెలిపారు. అలాంటి ఉత్పత్తిని తయారు చేసే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనే సరికాదని అంటున్నారు.
ఇదీ చదవండి:
brahmamagari pitham: బ్రహ్మంగారి పీఠంపై తెగని పంచాయితీ.. హైకోర్టుకు చేరిన వివాదం!