విశాఖలోని సింహాచలం దేవాలయంలో 51 రోజుల అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సింహగిరిపై భక్తులు 3 అడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. ఏ ప్రాంతంలో శానిటైజర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ముందుగా లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. గంటకు సుమారు 250 మంది స్వామి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. దర్శనం టికెట్లు ఆన్ లైన్ ద్వారా ఇవ్వాలా.. లేదా.. అన్నది అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని ఆలయ ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. భక్తులకు శఠగోపం పెట్టటం, ప్రసాదాలు పంపిణీ లాంటివి ఏమీ ఉండవని తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా ప్యాకేజీ రెండో రోజు వివరాలు సంక్షిప్తంగా..