సామాన్య ప్రజలకు చౌక ధరకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని గుడివాడ సమీపంలో బొలెరో వాహనంలో... తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో పోలిసులు తనిఖీ చేశారు.
నిందితుడు మేకల శివకుమార్ బియ్యాన్ని చోడవరం మండలంలో వెంకన్నపాలెం రైస్ మిల్ కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్నవాహనాన్ని పౌరసరఫరాల తాసిల్దారు ఆకుల సులోచనా రాణికి అప్పగించనున్నారు.
ఇదీ చదవండి: