విశాఖ నగరానికి చెందిన పుచ్చ జీవన్ అమృత అనే తొమ్మిదేళ్ల బాలిక.. అనాథ. ఆమెకు సొంతవారు లేరని తెలుసుకున్న వైకాపా నాయకుడు సంపంగి శ్రీను... అండగా నిలిచారు. లక్షా 20 వేల రూపాయల విలువైన జీవిత బీమా పాలసీని చేసి ఉచితంగా చిన్నారికి అందించారు. పాలసీ పత్రాలను ఉత్తర నియోజకవర్గం వైకాపా నేత కేకే రాజు చేతుల మీదుగా చిన్నారికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల ద్వారా అమృతకు అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని కేకే రాజు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి