ETV Bharat / state

కరోనా లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దు: కలెక్టర్

కొవిడ్ లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రజలకు సూచించారు. జిల్లాలో 22 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్-19 సేవలకు నిర్దేశించినట్లు కలెక్టర్ తెలిపారు. తక్కువ లక్షణాలు ఉన్న వారిని, ఏ లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ ఉన్నవారిని హోం ఐసోలేషన్​లో ఉంచుతున్నట్లు ఆయన వివరించారు.

కరోనా లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దు: కలెక్టర్
కరోనా లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దు: కలెక్టర్
author img

By

Published : Jul 28, 2020, 10:50 AM IST

విశాఖ జిల్లాలో 22 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్-19 సేవలకు నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 32 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా... 7,390 పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. తక్కువ లక్షణాలు ఉన్న వారిని, ఏ లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ ఉన్నవారిని హోం ఐసోలేషన్​లో ఉంచుతున్నట్లు ఆయన వివరించారు. వైరస్ తీవ్రంగా ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు 8, ప్రైవేట్ ఆసుపత్రులు 14 ఉన్నాయని..,ఈ ఆసుపత్రుల్లో 7 వేల పడకలు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది కొరతగా ఉందని..,కొరతను తీర్చడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) వైద్యులతో ఇప్పటికే మాట్లాడమన్నారు. వారు విధులలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు.

కొవిడ్ లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దని.., అలా చేయించుకోవాలనుకొనే వారు ప్రైవేట్ ల్యాబ్స్​లో చేయించుకోవాలని సూచించారు. రుసుం రూ.750 చెప్పారు. జీవీఎంసీ పరిధిలోని వార్డుల్లో ప్రత్యేక అధికారులు, వైద్యులను నియమించామన్నారు. జీవీఎంసీ, గ్రామీణ పరిధిలో అంబులెన్స్​లు, 104 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఇదీచదవండి

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రాణాలుకోల్పోతున్నారు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.