విశాఖలోని కోడింగ్ ఫర్ కిడ్స్ సంస్థకు చెందిన చిన్నారులు... బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ నిర్వహించిన ప్రతిభ పోటీల్లో సత్తా చాటారు. 33 దేశాల నుంచి సుమారు 30వేల బృందాలతో పోటీ పడి విజేతగా నిలిచారు. లండన్‌లో జరిగిన తుది పోటీలకు మన దేశానికి చెందిన మూడు బృందాలు ఎంపికయ్యాయి. ఇందులో.... సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు బృందాలు విశాఖకు చెందినవే. వాటిలో జూనియర్ విభాగంలో సిల్వర్ ఓక్స్ పాఠశాల జట్టు చాంపియన్, ఉత్తమ ప్రదర్శన అవార్డులు గెలుచుకుంది. సీనియర్ విభాగంలో విశాఖ వ్యాలీ పాఠశాల విద్యార్థులు రన్నరప్, ఉత్తమ రిపోర్టు అవార్డులు సాధించారు.
అంతరించిపోయే దశలో ఉన్న జంతువుల పరిరక్షణ కోసం... ఈ విద్యార్థులు ఓ ప్రాజెక్టు రూపొందించారు. దీనికోసం వారు డిజైన్ చేసిన డ్రోన్లు,.. అందులో వినియోగించిన కోడింగ్... వారిని విజేతలుగా నిలిపాయని శిక్షకులు చెప్పారు. మొత్తం 13విభాగాల్లో పోటీలు జరగ్గా.... 5 అవార్డులు విశాఖ విద్యార్థులనే వరించాయి.