విశాఖ మన్యానికి పర్యటకులు పోటెత్తారు. ఇవాళ ఈ ఏడాది చివరి ఆదివారం కావటంతో ఆంధ్రా కశ్మీర్ లంబసింగికి జనం అధిక సంఖ్యలో వచ్చారు. చెరువుల వేనం, తాజంగి జలాశయాల వద్దకు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే చెరువుల వేనం వద్ద సందడి నెలకొంది. మంచు అందాలకు పర్యటకులు ఫిదా అయ్యారు. తాజంగి జలాశయం వద్ద జిప్‌లైన్‌లో ప్రయాణించేందుకు పోటీపడ్డారు. జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద రద్దీ నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటకులు వస్తూనే ఉన్నారు. జలపాతంలో పిల్లలు, పెద్దలు హుషారుగా గడిపారు. సీలేరులో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆంధ్రాతో పాటు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేశారు.
ఆంధ్రా కశ్మీర్‌కు పోటెత్తిన పర్యటకులు - best tourist place in ap
మంచు దుప్పటి కప్పుకున్న విశాఖ మన్యం అందాలను చూసేందుకు పర్యటకులు పోటీపడ్డారు. ప్రకృతి సౌందర్యానికి ఫిదా అయిపోయి... ఉల్లాసంగా గడిపారు.
![ఆంధ్రా కశ్మీర్‌కు పోటెత్తిన పర్యటకులు vishaka agecy attracting tourists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5530893-790-5530893-1577628027946.jpg?imwidth=3840)
విశాఖ మన్యానికి పర్యటకులు పోటెత్తారు. ఇవాళ ఈ ఏడాది చివరి ఆదివారం కావటంతో ఆంధ్రా కశ్మీర్ లంబసింగికి జనం అధిక సంఖ్యలో వచ్చారు. చెరువుల వేనం, తాజంగి జలాశయాల వద్దకు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే చెరువుల వేనం వద్ద సందడి నెలకొంది. మంచు అందాలకు పర్యటకులు ఫిదా అయ్యారు. తాజంగి జలాశయం వద్ద జిప్‌లైన్‌లో ప్రయాణించేందుకు పోటీపడ్డారు. జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద రద్దీ నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటకులు వస్తూనే ఉన్నారు. జలపాతంలో పిల్లలు, పెద్దలు హుషారుగా గడిపారు. సీలేరులో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆంధ్రాతో పాటు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేశారు.
ప్రకృతి ఒడిలో...కోలాహలం
విశాఖ మన్యానికి పర్యటకులు పోటెత్తారు. ఈ ఏడాది చివరి ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా తరలివచ్చి సహజ సిధ్ద అందాలను చూసి మైమరచిపోయారు. శనివారం రాత్రే సుదూరప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా లంబసింగికి తరలివచ్చి ప్రకృతి అందాలను చూసి పరవసించిపోయారు. ఆదివారం విశాఖ మన్యంలోని ఆంద్రా కశ్మీర్ లంబసింగికి పర్యటకులు పోటెత్తారు. చెరువుల వేనం, తాజంగి జలాశయాలకు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం ఆరుగంటలు నుంచే సందడి ప్రారంభమైంది. చెరువుల వేనం మంచు అందాలకు పర్యటకులు ఫిదా అయ్యారు. తాజంగి జలాశయంలో జిప్‌లైన్‌లో ప్రయాణించేందుకు పోటీపడ్డారు. జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతానికి పోటేత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తునే ఉన్నారు. జలపాతంలో పలువురు పిల్లలు, పెద్దలు జలకాలాడుతూ హుషారుగా గడిపారు. సీలేరులో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆ:ద్రాతో పాటు తెలంగాణా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేశారు.
Conclusion:M Ramanarao,9440715742