స్వచ్ఛభారత్-2020 ప్రధాన మంత్రి అవార్డు రేసులో మహావిశాఖ నగరపాలక సంస్థ, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీ యూనిట్లు నిలిచాయి. పట్టణ స్థానిక సంస్థల జాబితాలో మొదటి పది స్థానాల్లో నిలిచిన నగరాల్లో పారిశుద్ధ్యం పరిస్థితులను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ప్రతినిధులు ఇటీవల జూమ్ యాప్ ద్వారా పరిశీలించారు. పది పట్టణ స్థానిక సంస్థల్లో నాలుగు చివరి పోటీలకు అర్హత సాధించగా అందులో విశాఖ చోటు దక్కించుకుంది. ప్రస్తుతం విశాఖపట్నం, ఇండోర్, సూరత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా పోటీలో ఉన్నాయి. ప్రధాన మంత్రి అవార్డు విజేతను మరో వారం రోజుల్లో కేంద్రం ప్రకటించనుంది.
ఇవీ చదవండి: భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయండి: కలెక్టర్