ETV Bharat / state

కొవిడ్ కారణంగా ఆలస్యంగా విశాఖ విమానాశ్రయ విస్తరణ పనులు - Land survey for new runway

విశాఖపట్నం విమానాశ్రయ విస్తరణ పనుల ప్రారంభోత్సవం వాయిదా పడేలా కనిపిస్తోంది. చైనా నుంచి రావాల్సిన పలు కీలక యంత్రాల తయారీ ఆలస్యమవుతుండటం, వాటిని తరలించేందుకు మరింత సమయం కావాల్సి రావడంతో చిక్కులొస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది మేలోపు కొత్త టెర్మినల్‌ భవనాలకు భూమి పూజ కావాల్సి ఉంది. కొవిడ్‌ కారణంగా నిర్మాణాల గడువునూ పొడిగించుకుంటూ వచ్చారు. ఆటంకాల్ని అధిగమించి వచ్చే ఏడాది మార్చిలోపు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

కొవిడ్ కారణంగా ఆలస్యంగా విశాఖ విమానాశ్రయ విస్తరణ పనులు

author img

By

Published : Oct 28, 2020, 7:36 AM IST

వైజాగ్ విమానాశ్రయ విస్తరణ పనులకు భూమి పూజ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త టెర్మినల్‌లో ప్రయాణికులు రాకపోకలు మొదలవ్వాలంటే.. లగేజీని తీసుకెళ్లే నాలుగు కన్వేయర్ ‌బెల్టులు, ప్రయాణికులు ఎక్కే రెండు ఎస్కలేటర్లు, అనుబంధంగా మరో రెండు గ్లాస్‌ ఎలివేటర్లు, ఇతరత్రా విడిభాగాలు అవసరం. ఇవన్నీ చైనా నుంచే రావాల్సి ఉంది. అక్కడ్నించి యంత్ర సామగ్రి రాక ఆలస్యమవుతుండటం వల్ల నిర్మాణాలకు శంకుస్థాపన గడువును పొడిగించాల్సి వస్తోంది.

కొవిడ్ కారణంగా ఆలస్యంగా విశాఖ విమానాశ్రయ విస్తరణ పనులు
కొవిడ్ కారణంగా ఆలస్యంగా విశాఖ విమానాశ్రయ విస్తరణ పనులు

లాక్​డౌన్ నుంచే..

లాక్‌డౌన్‌ నుంచి చైనా పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించాయని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి కన్వేయర్‌ బెల్టులు, విమానాశ్రయం కొలతను బట్టే ప్రత్యేకంగా డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. చైనాలో ఆంక్షల కారణంగా వాటి తయారీలో ఆలస్యమవుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు. అక్కడి కంపెనీలతో గుత్తేదారులు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు.

కొవిడ్ నేపథ్యంలో..

విస్తరణ పనులు మేనెల లోపే పూర్తవ్వాల్సి ఉండగా కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికి 70శాతం వరకే పూర్తయ్యాయని వివరించారు. డిసెంబరులోపు పూర్తి చేస్తామని ఓ వైపు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు యంత్రాల ఆలస్యం, నిర్మాణాల గడువు పొడగింపుతో.. డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య టెర్మినల్‌ భవనాల్ని సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు.

కొత్తది వారికి.. పాతది వీరికి..

ప్రారంభోత్సవమయ్యాక కొత్త టెర్మినల్‌ భవనాల్ని అంతర్జాతీయ ప్రయాణికులకు, పాత టెర్మినల్‌ను దేశీయ ప్రయాణికులకు కేటాయించనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.70కోట్లు వెచ్చిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అదనపు ట్రాక్‌కు సర్వే

ప్రధాన రన్ ‌వేకి సమాంతరంగా మరో ట్రాక్‌ (ఎన్‌5)ను అందుబాటులోకి తెచ్చేందుకు విమానాశ్రయ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ట్రాక్‌ నేవీ ఆధీనంలో ఉండటంతో ఇరు వర్గాల మధ్య సంప్రదింపులు జరిగాయి. మరి కొన్నాళ్లలో దిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని తెప్పించి దీన్ని అమల్లోకి తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రధాన రన్‌వేపై విమానాల ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నప్పుడు.. వాటిని వెంటనే ఎన్‌5 ట్రాక్ ‌మీదికి మళ్లించి పార్కింగ్‌ బేలకు వెళ్లేలా చేయాలి. ఈ పార్కింగ్ ‌బేలు ఎక్కడ పెట్టాలనేది సర్వే బృందం నిర్ధారించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :

ఎన్నికల సంఘంతో సమావేశానికి వైకాపా దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.