ETV Bharat / state

విశాఖ యువకుడి సాహసం.. ఏడు ఎత్తైన శిఖరాల అధిరోహణ

author img

By

Published : Jan 30, 2023, 2:18 PM IST

Climbed Seven High Peaks: విశాఖ నగరానికి చెందిన భూపతిరాజు అన్మిష్‌ వర్మ (30) అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలను అధిరోహించి భారత పతాకాన్ని ఎగుర వేశారు.

Visakha  young man climbed seven high peaks
విశాఖ యువకుడు ఏడు ఎత్తైన శిఖరాల అధిరోహణ

Climbed Seven High Peaks: భూపతిరాజు అన్మిష్‌ వర్మ అరుదైన ఘనత సాధించారు. విశాఖ నగరానికి చెందిన భూపతిరాజు అన్మిష్‌ వర్మ (30) ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలను అధిరోహించి భారత పతాకాన్ని ఎగుర వేశారు. మధురవాడ సమీప పీఎంపాలెం ప్రాంతానికి చెందిన ఆయన 2020లో ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలన్న తపన అతనిలో ఉండేది. ఈ క్రమంలో ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాల అధిరోహణ (సెవెన్త్‌ సమ్మిట్‌ ఛాలెంజ్‌)పై దృష్టి సారించారు. 2020లో తన ప్రస్థానం ప్రారంభించి ఆసియా (ఎవరెస్టు), దక్షిణ అమెరికా (మౌంట్‌ అకాంగువా), ఆఫ్రికా (కిలిమంజారో), యూరప్‌ (ఎల్‌బ్రస్‌), ఉత్తర అమెరికా (డెనాలి), ఆస్ట్రేలియా (మౌంట్‌ కొస్కిస్కో), చివరిగా ఈ నెల 22న అంటార్కిటికాలోని మౌంట్‌ విన్సన్‌ను అధిరోహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భూపతిరాజు అన్మిష్‌ వర్మ ప్రపంచ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున 75 కిలోల లోపు విభాగంలో గతంలో 6 సార్లు పాల్గొన్నారు. ఒకసారి వెండి, రెండు సార్లు బంగారు పతకాలు సాధించారు. సెవెన్త్‌ సమ్మిట్‌ ఛాలెంజ్‌ లక్ష్యాన్ని మూడేళ్లలో పూర్తి చేసినట్లు అన్మిష్‌ వర్మ పేర్కొన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.