విశాఖపట్నంలో కరోనా నిర్ధారణ ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యుడు గణబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. నమూనాల సేకరణకు పరికరాలతో పాటు, క్షేత్రస్థాయిలో పని చేసే వారికి ఎన్95 మాస్క్లు, విశాఖలో పని చేసేందుకు 10వేల మంది సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ కారణంగా ఆదాయం పడిపోయినందున నగర వాసులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ.. విద్యుత్ ఛార్జీలు, ఇతర పన్నులపై రెండు నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్రం ప్రజలకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన రీతిలో రాష్ట్ర ప్రభుత్వమూ ఉదారంగా ఆదుకోవాలని గణబాబు సూచించారు.
ఇదీ చదవండి.