ETV Bharat / state

జనసేన నేతల బెయిల్ పిటిషన్ రద్దు.. జ్యుడీషియల్ కస్టడీ

author img

By

Published : Oct 19, 2022, 7:52 PM IST

COURT REJECTED THE BAIL PETITION OF JANASENA ACTIVISTS : జనసేన నేతల బెయిల్ పిటిషన్​ను విశాఖ మేజిస్ట్రేట్​ రద్దు చేసింది. పోలీసుల అభ్యర్థన మేరకు.. 9మంది జనసేన నేతలకు రెండ్రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలిచ్చింది.

COURT REJECTED THE BAIL PETITION OF JANASENA ACTIVISTS

COURT CANCEL THE BAIL PETITION OF JANASENA ACTIVISTS : విశాఖలో మంత్రుల కార్లపై దాడికి దిగిన జనసేన నేతలకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు జనసేన నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ను విశాఖ కోర్టు కొట్టేసింది. అదే సమయంలో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు.. నిందితులను పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విశాఖ గర్జన పేరిట ఉత్తరాంధ్ర జేఏసీ విశాఖలో చేపట్టిన కార్యక్రమానికి వైకాపా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మంత్రులు, వైకాపాకు చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన రోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్​కు స్వాగతం చెప్పేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసైనికులు.. విశాఖ గర్జన ముగించుకుని వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, వైకాపా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి దిగారు.

ఈ ఘటనలో పోలీసులు 70 మంది జన సైనికులను అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా.. అరెస్టయిన వారిలో 61 మంది నిందితులకు అక్కడికక్కడే బెయిల్ లభించింది. మిగిలిన 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 9 మంది తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో పాటు.. పోలీసుల అభ్యర్థన మేరకు వారిని రెండురోజుల పాటు న్యాయవాదుల సమక్షంలో పోలీసు కస్టడీకి అనుమతించింది. యలమంచిలి నేత సుందరవు విజయకుమార్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని.. కిడ్నీలో రాళ్లు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన యలమంచిలి నేతలు చెబుతున్నారు. ఇవాళ ఆపరేషన్ చేసుకోవాల్సి ఉందని.. అందుకు ఏర్పాట్లు చేసుకోగా ఇలా అరెస్టు చేశారని.. ఆయనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని వారు కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.