విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో ఘనంగా గణతంత్ర వేడుకలు - Eastern Naval Headquarters republic day celebrations news
విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో ఐఎన్ఎస్ సర్కార్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. నౌకాదళ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు వైస్ అడ్మిరల్ జైన్ శుభాకాంక్షలు తెలిపారు. మార్చ్‌లో నిర్వహించే మిలన్ - 2020ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. దేశ రక్షణ దృష్ట్యా కొన్ని రోజుల పాటు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని అన్నారు. ఈ వేడుకలో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో..గణతంత్ర వేడుకలు