Visaka Indian Institute Of Petroleum And Energy: విశాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సంస్ధ రెండో స్నాతకోత్సవం రేపు జరగనుంది. ఈ స్నాతకోత్సవంలో ముగ్గురు విద్యార్థులకు బంగారుపతకాలు, ఇద్దరికి వెండి పతకాలు ప్రధానం చేయనున్నారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేయనున్నారు. ఇన్స్టిట్యూషన్ గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్.. ఈ రెండు బంగారు పతకాలను అగ్రాని అనే విద్యార్థిని దక్కించుకుంది. కెమికల్ ఇంజనీరింగ్‌లో చిదురాల హృతిక్‌కి బంగారు పతకం లభించింది. ఎస్బీఐ సిల్వర్ మెడల్ ప్రియాంషు అగర్వాల్, అవిక్‌రాయ్ అనే విద్యార్థులు సాధించారు. పరిశోధన ప్రాజెక్టులను చేపడుతున్నట్టు సంస్థ డైరక్టర్ ఆచార్య శాలివాహన్ వెల్లడించారు. ఎర్త్ సైన్సెస్, మెకానికల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలున్నాయని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటి ప్రారంభానికి కృషిచేస్తున్నట్లు పేర్కోన్నారు. ప్రస్తుతం కోర్సులను పూర్తి చేసిన వారందరికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఇందులో 75 శాతం మందికి కోర్ సెక్టార్లోనే ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: