ETV Bharat / state

గాజువాకను వణికిస్తున్న విష జ్వరాలు - latest news of dengu fevers in visakha

విశాఖలో విషజ్వరాలు విజృంభించాయి. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలో అధిక సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఓ వైపు మున్సిపాలిటీ అధికారులు పరిశుభ్ర చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేసి తగిన మందులు అందిస్తున్నారు వైద్యులు.

గాజువాకను వణికిస్తున్న విషజ్వరాలు
author img

By

Published : Nov 13, 2019, 7:53 AM IST

గాజువాకను వణికిస్తున్న విష జ్వరాలు

విశాఖ నగరంలో కీలక ప్రాంతం గాజువాక. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనితో ప్రజలంతా పెద్ద గంట్యాడ, గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆశ్రయించారు. రోగులకు వైద్యులు డెంగీ, మలేరియా పరీక్షలు చేసి ఫలితాలు వెను వెంటనే ఇస్తున్నారు. విపరీతమైన దోమలు, అపరిశుభ్రమైన వాతావరణం వల్ల జ్వరాలు పెరిగాయని స్థానికులు చెప్తున్నారు.

జ్వరాల కేసులు ఎక్కువ వస్తున్నట్టు పెద్దగంట్యాడ వైద్యులు అంటున్నారు. దీనికోసం పెద్ద గంట్యాడ, గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు సిద్ధం చేశారు. రోజు ఫాగింగ్ చేయటం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమలు, లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల నివారణ చర్యలు ఇంకా పెంచాలని గాజవాక వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి

ఇసుక దోపిడీపై.. తెదేపా ఛార్జిషీట్‌'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.