సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభ్యులుగా ఎన్నికై తొలిసారిగా విశాఖ జిల్లా రోలుకుంట చేరుకున్న కరణం ధర్మశ్రీకి ఘన స్వాగతం లభించింది. వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోలుగుంట చేరుకుని ధర్మశ్రీ కివిజయ హారతులు పట్టారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించి శాలువాలు కప్పి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు ధర్మశ్రీ మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో గ్రామాలను అభివృద్ధి చేయటానికి తనవంతు కృషి చేస్తానని వ్యాఖ్యనించారు.
ఇదీచదవండి