రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జే.పీ. అగ్రహారం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నర్సీపట్నం మండలం సుబ్బారాయుడుపాలెం నుంచి రోలుగుంట మండలం కొమరవోలు మీదుగా జే.పీ. అగ్రహారం వరకు ఉన్న 13 కిలోమీటర్ల రహదారి అధ్వాన్నంగా తయారైంది. దీని మరమ్మతుల కోసం 3 నెలల క్రితం సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ నగరానికి చెందిన గుత్తేదారు టెండర్ పొందాడు. అయితే అతను తారురోడ్డును పెకిలించి అలా వదిలేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలినడక సాధ్యపడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..