విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ పంచాయితీ బేతపూడి కేజీబీవీ పాఠశాలలో నాడు - నేడు పనులు చేపట్టారు. ఈ అభివృద్ధి పనులకు చెట్లు అడ్డంకిగా మారాయని నెపంతో 45 ఏళ్ల నాటి భారీ వృక్షాలను నాడు-నేడు పనులు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్లు అడ్డగోలుగా కూల్చివేశారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నాయని అక్కడ కూడా కొంత మంది వ్యక్తులు చెట్లను నరికేశారు. గ్రామస్తులు అభ్యంతరం తహసీల్దార్ రమేష్ బాబుకు ఫిర్యాదు చేయ్యంగా స్పందించిన ఆయన చెట్లను నరికివేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
అటవీశాఖ అధికారులు నరికేసిన చెట్లను స్వాధీనం చేసుకొని కొలతలు వేశారు. ఈ ప్రాంతంలో దాదాపుగా ఎనిమిది భారీ వృక్షాలు నేల కూల్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. మరోవైపు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కేజీబీవీ పాఠశాలకు అడ్డంగా ఉన్న చెట్లను నరికినట్లు ఎస్.ఓ విజయ తెలిపారు.
ఇవీ చూడండి: