విశాఖ మన్యం గుర్రాయి జలపాతంలో స్నానానికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. సెలవు రోజు కావడంతో జలపాతంలో స్నానం చేయడానికి ఐదుగురు విద్యార్థులు గుర్రాయి జలపాతంకు చేరుకున్నారు. ముగ్గురు విద్యార్థులు జలపాతం బయట ఉండగా రవికిరణ్, మార్టిన్ స్నానం చేసేందుకు జలపాతం అంచుకు చేరుకున్నారు. ఇదే సమయంలో ప్రమాదవశాత్తు రవికిరణ్ జారిపోయి పడిపోయాడు. రవికిరణ్ ను రక్షించేందుకు తోటి విద్యార్దులు చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. జలపాతం 30 అడుగుల లోతు వరకు ఉండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు గాలింపు చేపట్టి, రవికిరణ్ మృతదేహం వెలికితీశారు. మృతుడు పెదబయలు మండలం కీముడుపల్లికి చెందినవాడిగా గుర్తించారు.
ఇది కూడా చదవండి.