విశాఖ జిల్లా పాడేరు ఘాట్రోడ్డులో భారీ సరకు లారీ రోడ్డు అడ్డుగా నిలిచిపోయింది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి.
మైదాన ప్రాంతాల నుంచి పాడేరులో నిర్మాణం అయ్యే గిరిజన కళాశాలకు భారీ యంత్రాలు తరలించే ఈ లారీ... పాడేరు ఘాట్ రోడ్డు ఏసుప్రభుత మలుపు వద్ద రహదారికి అడ్డంగా నిలిచిన కారణంగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రానికి 2 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: