తెదేపా నేతల అరెస్టుకు నిరసనగా విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. ఆయన ఇంటి ఆవరణలోనే కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తెదేపా నేతలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్రెడ్డిలపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చూడండి...