ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ లో ముమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి. నర్సీపట్నం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే 40 శాతానికి పైగా వరి నాట్లు పడ్డాయని అధికారులు అంటున్నారు. డివిజన్లో నర్సీపట్నం తో పాటు రోలుగుంట, రావికమతం గొలుగొండ, మాకవరపాలెం, మాడుగుల తదితర మండలాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సంబంధించి సుమారు 800 టన్నులకు పైగా వరి విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయాలు జరిగాయి. డివిజన్లో సుమారు 55 వేల ఎకరాలకు పైగా నాట్లు పడాల్సి ఉంది.
ఇదీ చూడండి