ETV Bharat / state

విశాఖ జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ - విశాఖ జిల్లా కరోనా వ్యాక్సినేషన్​

విశాఖ జిల్లావ్యాప్తంగా కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. జిల్లాలోని 32 ఆరోగ్య కేంద్రాల్లో 38 వేల మందికి టీకా వేసేందుకు జిల్లా వైద్యాధికారులు సమాయత్తమయ్యారు. కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

covid vaccine
వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభం
author img

By

Published : Jan 16, 2021, 4:19 PM IST

విశాఖలో కొవిడ్ 19 నియంత్రణ టీకా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 32 ఆరోగ్య కేంద్రాల్లో 38 వేల మందికి టీకా వేయడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. విశాఖ చిన వాల్తేర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇద్దరు వైద్యాధికారులు, జీవీఎంసీ, జిల్లా వైద్యశాఖాధికారులు సమన్వయంతో టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సహాయ సిబ్బందికి టీకాను అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ చిన వాల్తేర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి దృశ్య శ్రవణ మాధ్యమ సమీక్షలో పాల్గొనారు.

vaccine
వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బంది

పాడేరులో...

విశాఖ పాడేరు ఏజెన్సీలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకులోయ ఎంపీ మాధవి పాల్గొన్నారు. తొలి విడతగా వైద్యులకు వ్యాక్సిన్ ఇచ్చారు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కృష్ణారావుకు తొలి వ్యాక్సినేషన్ ఇచ్చారు.

ఎలమంచిలిలో...

ఎలమంచిలి పట్టణంలో కరోనా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి ముందుగా కరోనా వ్యాక్సిన్ వేశారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కోయ్యూరులో...

విశాఖ మన్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అరకు ఎంపీ మాధవి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు .

చినవాల్తేర్​లో...

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, స్థానిక శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ సంయుక్తంగా కొవిడ్​ వ్యాక్సినేషన్​ను​ ప్రారంభించారు.

చోడవరం నియోజకవర్గంలో...

చోడవరం నియోజకవర్గంలో కోవిడ్ వాక్సిన్ అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ముందుగా వాక్సిన్​ను ఆశా కార్యకర్తలకు వైద్యులు ఇచ్చారు.

అనకాపల్లిలో...

అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ టీకా కార్యక్రమాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్, ఆర్డీవో సీతారామారావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పాడేరును కమ్మేసిన పొగమంచు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.