ETV Bharat / state

US Consulate General: అమెరికా కాన్సుల్‌ జనరల్‌ అరకు విహారం

author img

By

Published : Sep 22, 2021, 9:46 AM IST

విశాఖ జిల్లాలోని అరకులో.. అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మన్‌ విహరించారు. తన జీవన భాగస్వామి (గే) పెర్రీ మిల్టన్‌తో కలసి సోమవారం విశాఖ వచ్చిన ఆయన.. మంగళవారం అరకు వెళ్లారు. అద్దాల బోగీలున్న రైల్లో ప్రయాణిస్తూ కొండలు, లోయల అందాలను ఆస్వాదించినట్లు చెప్పారు. విశాఖలోని తీరప్రాంతం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.

US Consulate General  joel rifman visited araku
అమెరికా కాన్సుల్‌ జనరల్‌ అరకు విహారం

అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మన్‌.. విశాఖ జిల్లాలోని అరకులో విహరించారు. తన జీవన భాగస్వామి (గే) పెర్రీ మిల్టన్‌తో కలసి సోమవారం విశాఖ వచ్చిన ఆయన.. మంగళవారం ఉదయం అద్దాల బోగీలున్న రైల్లో అరకు వెళ్లారు. ఈ రైల్లో ప్రయాణిస్తూ కొండలు, లోయల అందాలను ఆస్వాదించినట్లు చెప్పారు. అరకు గిరిజన మ్యూజియం చూసిన తరువాత గిరిజన చరిత్ర, వారి జీవన విధానంపై మరింత అవగాహన కలిగిందన్నారు. గిరిజనుల గురించి తెలుసుకోవడానికి అరకు లోయ అద్భుత ప్రాంతమని కొనియాడారు. విశాఖలోని తీరప్రాంతం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. నగరంలోని హోటల్‌ నుంచి బంగాళాఖాతం కనిపించేలా దిగిన ఫొటోలను, రైలులో మిల్టన్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోలను, అరకు గిరిజన మ్యూజియంలో ఫొటోలను జోయెల్‌ రీఫ్‌మన్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు. వీరిద్దరూ రెండు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారు.

ఇదీ చదవండి:

RAYALASEEMA LIFT: ఏపీ సీఎస్‌ తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు వేశారు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.