విశాఖ మన్యం కొండకోన అటవీ ప్రాంతాల్లో నాటు తుపాకీ శబ్ధాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అనంతగిరి మండలం బొడ్డవలసలో ఓ గిరిజనుడు నాటు తుపాకీకి బలయ్యాడు. నలుగురు వ్యక్తులు కోతుల బారి నుంచి చింతచెట్లు రక్షించుకునే క్రమంలో నాటు తుపాకులు పట్టుకుని అడవిలోకి వెళ్లారు. గలిపర్తి సన్యాసి అనే వ్యక్తి తుపాకీ పేల్చగా.. బుల్లెట్ తగిలి దత్తి సన్యాసిరావు అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా.. తాను కోతి అనుకుని కాల్చానని నిందితుడు చెప్పాడు. అయితే గతంలో వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయనీ.. కావాలనే చంపాడనీ మృతుని బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి