ETV Bharat / state

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య - అనకాపల్లి వార్తలు

భర్త వేధింపులు తాళలేక... మనస్తాపం చెంది భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని కృష్ణాపురం కాలనీలో జరిగింది.

Unable to bear husband's harassment wife commits suicide in visakha
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Sep 20, 2020, 7:17 AM IST

మద్యానికి అలవాటు పడ్డ భర్త నిరంతరం వేధించటం.... అత్త, మామ వత్తాసు పలకడంపై.. మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సమీపంలోని కృష్ణాపురం కాలనీలో జరిగింది.

అగనంపూడిలోని ఉప్పర్ల కాలనీకి చెందిన ధనలక్ష్మి(23)ని కృష్ణాపురం కాలనీకి చెందిన గోవింద....2017లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. గోవిందు గ్రామ వాలంటీర్​గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ వేధిస్తుండడంపై... విసుగు చెందిన ధనలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సూరి అప్పారావు తన కుమార్తె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్లాస్మా దానంతో వ్యక్తి ప్రాణాలు నిలిపిన కానిస్టేబుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.