ETV Bharat / state

విశాఖ రైల్వే జోన్‌ ప్రకటనకు రెండేళ్లు.. నేటికీ కానరాని పురోగతి! - Visakhapatnam Railway Zone latestnews

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించి శనివారానికి రెండేళ్లు పూర్తయింది. ఆ ప్రకటనను అమలు చేసేందుకు నిధుల కేటాయింపులో గానీ, పనుల్లో గానీ అంగుళమైనా పురోగతి లేకపోవడం.. రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి పెంచుతోంది.

Two years after the declaration of Visakhapatnam Railway Zone, there has been no complete inch of progress
విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించి రెండేళ్లు పూర్తి.. అంగుళం పురోగతీ లేదు
author img

By

Published : Feb 28, 2021, 7:57 AM IST

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించి శనివారానికి రెండేళ్లు పూర్తయింది. కానీ దాన్ని సాకారం చేసేందుకు నిధుల కేటాయింపులో గానీ, పనుల్లో గానీ అంగుళం కూడా పురోగతి లేదు. విశాఖ రైల్వేజోన్‌ని విభజన చట్టంలో కేంద్రం పొందుపరిచింది. 2019 ఫిబ్రవరి 27న రైల్వేజోన్‌పై ప్రకటన చేసింది. అక్కడితో సరి! దాన్ని పక్కన పడేసింది. కేంద్రం గట్టిగా తలచుకుంటే ఐదారు నెలల్లోనే జోన్‌ సాకారమయ్యేది.

11 నెలల్లోనే విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటవుతుందని 2019 మార్చి 8న వెల్లడించిన రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌.. డీపీఆర్‌ ఇంకా రైల్వేబోర్డు పరిశీలనలోనే ఉందని ఇప్పుడు చెబుతున్నారు. రైల్వేజోన్‌ ఏర్పాటుకు నిర్దిష్ట కాలావధి ఏమీ లేదనీ అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలుపై కేంద్రప్రభుత్వ వైఖరికి... ఈ విషయంలో జరుగుతున్న తాత్సారమే నిదర్శనం. గత రెండు కేంద్ర బడ్జెట్లలో విశాఖ రైల్వేజోన్‌కు కేటాయించిన నిధులు చూస్తుంటే.. మరో ఐదారేళ్లయినా విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటవుతుందా అన్న సందేహం కలుగుతోంది.

రాష్ట్ర ప్రజల మనోభావాలు పట్టవా?

విశాఖ రైల్వేజోన్‌ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్‌. 2003లో భువనేశ్వర్‌ కేంద్రంగా తూర్పుకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగాలు, కొత్త రైళ్ల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధిలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. అప్పటినుంచి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు గళమెత్తుతూనే ఉన్నారు. ఎట్టకేలకు కేంద్రం విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చింది.

తీరా జోన్‌పై అధికారిక ప్రకటన చేసేటప్పుడు... వాల్తేరు రైల్వే డివిజన్‌ను రద్దుచేసి, దాన్ని విజయవాడ డివిజన్‌లో కలిపేస్తున్నట్టు చెప్పింది. దానికి బదులు ఒడిశాలోని రాయగఢ్‌ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఒక చేత్తో రైల్వేజోన్‌ ఇస్తూ... మరో చేత్తో కొన్ని దశాబ్దాలుగా ఉన్న డివిజన్‌ను తీసేస్తుందన్న మాట! దానిపైనా ప్రజల్లో నిరసన పెల్లుబికింది. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్‌ కావాలన్న డిమాండ్‌ స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

కానీ దాన్ని కేంద్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుకు అవసరమైన భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో దీనికి కేటాయించింది రూ.3 కోట్లు. దాన్ని కూడా రాయగఢ్‌ డివిజన్‌ పనులకు వినియోగించారు. ఇక 2021-22 బడ్జెట్‌లో కేటాయించింది రూ.40 లక్షలే! రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలపై కేంద్రప్రభుత్వ తీరు ఎలా ఉందో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

ఇంకెన్నాళ్లీ అన్యాయం?

* ప్రస్తుతం విశాఖ జిల్లాలోని తాడి వరకు దక్షిణ మధ్యరైల్వే పరిధిలో, ఆ తర్వాతి నుంచి తూర్పుకోస్తా రైల్వే పరిధిలో ఉంది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్‌ ఏర్పాటైతే, శ్రీకాకుళం జిల్లాలో కుర్దా డివిజన్‌ పరిధిలో ఉన్న కొద్దిభాగం తప్ప... ఉత్తరాంధ్రలోని మిగతా ప్రాంతమంతా విశాఖ రైల్వేజోన్‌ పరిధిలోకి వస్తుంది.

* అటు హైదరాబాద్‌, ఇటు బెంగళూరు వెళ్లాలంటే ప్రస్తుతం విశాఖ నుంచి రైల్లో రిజర్వేషన్‌ దొరకడం కష్టం. మొదట్లో విశాఖ నుంచే నడిచిన విశాఖ ఎక్స్‌ప్రెస్‌, ప్రశాంతి, విశాఖ-చెన్నై వీక్లీ రైళ్లను చాన్నాళ్ల క్రితమే భువనేశ్వర్‌ వరకు పొడిగించారు. విజయవాడ-విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్‌ను రాయగఢ్‌ వరకు పొడిగించారు. విశాఖ నుంచే రైళ్లే ప్రారంభమైతే మనకు కలిగే ప్రయోజనాల్ని కోల్పోవలసి వస్తోంది.

* రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్‌ అంటూ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు కొత్తగా రైలు సర్వీసులు ప్రారంభించాలంటే.. అటు హైదరాబాద్‌ వైపో, ఇటు భువనేశ్వర్‌ వైపో చూడాల్సిందే.

* భువనేశ్వర్‌లో జోన్‌ ఉండటం వల్ల రైల్వే ఉద్యోగాల్లో ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతోంది. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసేందుకు ఇక్కడి నుంచి వెళ్లే అభ్యర్థులపై అక్కడి స్థానికులు దాడులు చేసి, హాల్‌టికెట్లు చించేస్తున్నారు.

* తూర్పుకోస్తా రైల్వేకి విశాఖ డివిజన్‌ నుంచి ఏటా రూ.6-7 వేల కోట్ల ఆదాయం వస్తుంది.

* తూర్పుకోస్తా రైల్వేపై ఒడిశా ఆధిపత్యం కొనసాగుతోంది. కేంద్ర బడ్జెట్‌లో తూర్పుకోస్తా రైల్వేకి కేటాయించిన నిధుల్లో నామమాత్రంగానే ఏపీ పరిధిలో ఖర్చు పెడుతున్నారు.

* కొన్ని రైళ్లను విశాఖకు వెళ్లకుండా... దువ్వాడ మీదుగా పంపేస్తున్నారు. విశాఖ నుంచి దువ్వాడకి 30 కి.మీ.ల దూరం ఉంది. నగరానికి ఈ చివరన ఉన్న ఏ మధురవాడ నుంచో దువ్వాడ వెళ్లి రైలు ఎక్కాలంటే చాలా సమయం, డబ్బు వృథా అవుతోంది.

* వాల్తేరు డివిజన్‌కు ప్రధానంగా సరకు రవాణా వల్లే ఎక్కువ ఆదాయం వస్తోంది. అయినా.. విశాఖ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన వ్యాగన్ల కేటాయింపులో చాలా జాప్యం జరుగుతోంది.

* మనకంటూ ప్రత్యేక రైల్వేజోన్‌ ఉంటే.. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవులతో పాటు, భవిష్యత్తులో నిర్మించనున్న మచిలీపట్నం పోర్టులకు మెరుగైన రైల్వే అనుసంధానానికి వీలు కలుగుతుంది.

ఇదీ చదవండి:

అధికారుల ప్రవర్తనతో విసిగి... చందాలు వేసుకుని..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.