విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలానికి చెందిన ఇద్దరు మహిళలు 108 వాహనంలో ప్రసవించారు. వీరిద్దరిలో ఒకరు కవలలకు జన్మనిచ్చారు. తల్లిబిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వాహన సిబ్బంది... అప్పలనాయుడు తెలిపారు.
బుచ్చయ్యపేట మండలం పెదమదీనా గ్రామానికి చెందిన నమ్మిదేవి(22)ని రెండో కాన్పు కోసం 108 వాహనంలో ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో చోడవరం మండలం తిమ్మన్నపాలెం కూడలి వద్ద దేవి ప్రసవించింది. ఆమెకు పాప, బాబు పుట్టారు. ఇదే మండలానికి చెందిన చింతపాక గ్రామస్థురాలు కొరిమల లక్ష్మీ(23) తెల్లవారుజామున నొప్పులు రావడంతో బంధువులు 108 వాహనానికి సమాచారమిచ్చారు. అనకాపల్లికి తరలిస్తుండగా కూండ్రం కూడలి వద్ద పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఇదీ చదవండి