ETV Bharat / state

దివ్యాంగులను జంటగా చేశారు... దగ్గరుండి వివాహం జరిపించారు! - physically disabled persons marriage news update

వారిద్దరూ... దివ్యాంగులు. వారికి వివాహం కాలేదని తల్లిదండ్రులు మదన పడుతుండేవారు. అందుకే ఆ ఇద్దరూ జీవితంలో ఒకరికి ఒకరు తోడు కావాలనుకున్నారు. పెద్దలు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఆ ఇద్దరికి గ్రామ పెద్దలు దగ్గరుండి వివాహం జరిపించారు. విశాఖ జిల్లా కె.కోటపాడులో జరిగిన ఈ వివాహం విశేషాలివి.

two physically disabled persons
వివాహ బంధంతో ఒకరికి ఒకరైన దివ్యాంగులు
author img

By

Published : Jun 16, 2020, 12:12 PM IST

విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం మేడిచర్లకు చెందిన గుమ్మాల వెంకటరావు దివ్యాంగుడు. కింతాడ గ్రామానికి చెందిన మాధవి.. తన మనస్సులోని భావాలు మాటలతో వెల్లడిచ లేని మూగ యువతి. వీరిద్దరికీ పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు.

ఇరు గ్రామాల పెద్దలే బంధువులుగా వివాహాన్ని నిర్వహించారు. తమ చేతుల మీదుగా ఇద్దరిని జంటగా చేయడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు, నాయకులు ముత్యాలనాయుడు, నరసింహనాయుడు, సూర్యనారాయణ, నారాయణ మూర్తి, చిట్టెమ్మ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

దివ్య హత్య కేసు: తల్లిదండ్రుల మరణం తీరుపై పోలీసుల ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.