విశాఖ జిల్లా దొండపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్కాపురానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. దొండపర్తి వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనం ఢీ కొనటంతో ప్రమాదం జరిగింది. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో మల్కాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: