విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని వీరనారాయణంలో విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఆళ్ల అర్జున్ (38) తన ఇంటి నిర్మాణ కర్రలు తీస్తుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలాడు. అర్జున్ విద్యుదాఘాతానికి గురై.. సంఘటనా స్థలంలోనే మృతి చెందాడని ఎస్ఐ రామారావు చెప్పారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం జరిపారు.
వాహనం ఢీకొని..
జిల్లాలోని కె.కోటపాడు మండలం వారాడలో ఓ వ్యక్తిని వాహనం ఢీకొనగా అతను మరణించాడు. గ్రామానికి చెందిన భర్నికాన సూరి దేముడు (64) బహిర్భూమికి వెళ్తుండగా..గుర్తు తెలియని వాహనం ఢీకొంది. రోడ్డుపై రక్తం మడుగులో ఉన్న ఆయన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని ఏ.కోడూరు ఎస్ఐ అప్పలనాయుడు తెలిపారు.
ఇదీ చూడండి.
ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ప్రక్రియ ప్రారంభించిన ఈసీ