విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో నాటుసారా సేవించి ఇద్దరు మృతిచెందారు. కొయ్యూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన జనుమూరు బాలరాజు, కేడీపేటకు చెందిన పైల మత్స్య వెంకటరత్నం నాటుసారా సేవించడం వల్ల అపస్మారకస్థితిలోకి వెళ్లారు. ఇది గమనించిన వారి బంధువులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలరాజు చనిపోయాడు. వెంకటరత్నం చికిత్స పొందుతూ ఏరియా ఆసుపత్రిలో మరణించాడు. బాలరాజు భార్య మల్లయ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొయ్యూరు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి