విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎంకె. పట్నం పంచాయతీ శివారు పెద్ద పేట కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కడప జిల్లాకు చెందిన చవ్వా సుబ్బారెడ్డి, రమణారెడ్డిలుగా గుర్తించినట్లు రోలుగుంట ఎస్ఐ తెలిపారు. వారి నుంచి మహీంద్రా వెరిటో కారుతో పాటుగా మూడు సెల్ ఫోన్లు, రెండు వేల రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నారు. వీరికి గంజాయి ఎవరు విక్రయించారు? ఎవరి ద్వారా మైదాన ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు? అనే వివరాలను సేకరిస్తున్నామని ఎస్సై ఉమామహేశ్వర్ రావు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...