అనకాపల్లిలోని శ్రీరామ్‌నగర్ చెందిన ఏడిద జగదీష్ చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో కలిసి చదువుకున్నాడు. అప్పట్లో పాఠశాల తీసుకున్న ఫొటోలు, పాదయాత్ర సమయంలో జగన్‌తో తీసుకున్న ఫొటోలతో ఫ్లెక్సీ బోర్డు తయారు చేయించాడు. ఇదే ప్రాంతానికి చెందిన ముప్పిడి శ్రీను, జగదీష్ ఇద్దరు కలిసి మేడపై ఆ ఫ్లెక్సీ కడుతుండగా ఇంటికి ఎదురుగా ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. వారి మృతితో ఇరు కుటుంబాలలో విషాదం నెలకొంది.
ఇదీచూడండి.