సింహాచలం దేవస్థానంలో ఇటీవల చోటు చేసుకున్న వీడియో మార్ఫింగ్ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు వైదికులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఈవో ఎం.వి. సూర్యకళ తెలిపారు. ఓ వేద పండితుడు రూపొందించిన వీడియోను ఇంఛార్జ్ ఆలయ ప్రధానార్చకుడైన గొడవర్తి శ్రీనివాసాచార్యులుకు పంపగా.. ఆయన ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పలువురికి పంపించినట్లు తేల్చారు. ఈ మేరకు వారిద్దరితో పాటు మరో ఏడుగురికి ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు సమాధానం అందుకున్న తర్వాత మార్ఫింగ్‌కు కారణమైన వీరిద్దరిపై చర్యలకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆలయ ఈవోకు సిఫార్సు చేశారు. తాజా ఆదేశాల మేరకు వీరిని సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: