విశాఖ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి నివాళులు అర్పించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మానవ వనరుల శాఖ కేంద్రంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయనకు వక్తలు నివాళులర్పించారు. బాలు చిత్ర పటానికి సొసైటీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి. విశ్వనాథం, ఆచార్య జీఎస్ఎన్ రాజు,సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు, కాశీ విశ్వేశ్వర రావు పూలమాలలు వేశారు.
రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. బాలు విశ్వ మానవుడని, ఆయన తెలుగు సినీ సంగీతంలో తార అని కొనియాడారు. విశాఖతో ఎస్పీకి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలుకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని, ఆర్కే బీచ్ లో విగ్రహం ఏర్పాటు చేయాలని, ఆయన జన్మదినోత్సవాన్ని గాయకుల దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్. శ్రీనివాస రావు, చిన్నారావు, డీవీ సత్య, పీవీ .రమణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
కృష్ణా నదిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి.. నీటమునిగిన లంక గ్రామాలు