విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని గిరిజనులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా తాము పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేకపోవడంతో... వీరు బురద మయమైన రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ప్రధానంగా కొయ్యూరు మండలం ఎం. మాకవరం పంచాయతీ నుంచి పనసాలపడుకు వెళ్లేదారి అధ్వాన్నంగా తయారైందని, అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నామని వీరు పేర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రయోజనం లేదని అందుకే బురద మయమైన రోడ్డుపై ఇలా నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు పనులు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
'ప్రసాద్' పథకానికి సింహాచలం ఆలయం ఎంపిక.. రూ.53 కోట్లు విడుదల