మావోయిస్టుల షెల్టర్ జోన్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టుల అడ్డాగా పేరుగాంచిన ఆంద్రా-ఒడిశా సరిహద్దు కటాఫ్ ఏరియాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 'మా ప్రాంతాల అభివృద్ధికి మీరే నిరోధకులు... తక్షణమే కటాఫ్ ఏరియాను విడిచి వెళ్లిపోవాలి' అంటూ మావోయిస్టులకు సూచించారు.
గిరిజన ప్రాంతంలో ఉంటూ గిరిజనులను ఇన్‌ఫార్మర్ల పేరిట హతమారుస్తున్న మావోయిస్టు నాయకులు ఇక్కడనుంచి వెళ్లిపోండి అంటూ నినాదాలు చేశారు. 'మాకు హింస అక్కర్లేదు, శాంతి కావాలి' అంటూ సందేశాన్ని ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని గిరిజన నాయకులు అన్నారు.
ఇదీ చదవండి: