విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం సమ్మెద గిరిజన గ్రామానికి చెందిన టోకూరు గంగమ్మ (25) రెండు నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప నెల రోజులకే చనిపోయింది. అప్పటినుంచి గంగమ్మ మనోవేదనకు గురైంది. వారం నుంచి అనారోగ్యంతో ఆమె బాధపడుతోంది. కామెర్లు సోకడంతో ఆమె నాటువైద్యం చేయించుకుంటోంది. అయితే సోమవారం ఒక్కసారిగా బాలింత పరిస్థితి విషమించడంతో దేవరాపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. ఈ మేరకు ఎస్ఐ సింహాచలం సమ్మెద గ్రామానికి వెళ్లి విచారణ చేశారు.
ఇదీ చదవండి