మావోయిస్టులకు వ్యతిరేకంగా, బాధితులకు మద్ధతుగా విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం మద్దిగరువులో గిరిజనులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు మద్దతిచ్చారు. మావోయిస్టుల దుశ్చర్యలను గిరిజనులు వ్యతిరేకించారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే ముద్రవేసి అమాయక గిరిజనులను పొట్టనపెట్టుకున్నారన్నారు.
మన్యంలో పుట్టి బతకడమే మేము చేసిన తప్పా అంటూ ప్రశ్నించారు. ఎన్ని బెదిరింపులు, దుశ్చర్యలకు పాల్పడిన.. తాము అడవినే నమ్ముకున్నామని.. ఇక్కడే బతుకుతాం అని నినాదాలు చేశారు. మన్యం, మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోండని మావోయిస్టులను డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: