విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లిలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య చేసిన గిరిజనుడు గెమ్మెలి కృష్ణారావు మృతదేహానికి పాడేరు ఆస్పత్రిలో శవ పంచనామా పూర్తి చేశారు. మృతదేహాన్ని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ సీఐజీడి బాబు, బంధువులకు అప్పగించారు. ఆసుపత్రి వాతావరణంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.
తన భర్త ఇన్‌ఫార్మర్ కాదని... సమాచారం లేకుండానే మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని మృతుృడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారావుకి నలుగురు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: