విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం దేవరపల్లిలో పశువుల కాపరి లకేబాలయ్య విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. పశువులను మేపేందుకు వెళ్లి..తెగిపడిన విద్యుత్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పశువుల కాపరి ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్థులంటున్నారు. విద్యుత్ తీగలు తెగిపడ్డాయని చెప్పినా విద్యుత్ సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలిపారు.