ETV Bharat / state

శ్రావణ మాసం సెంటిమెంట్‌... విశాఖలో పెరుగుతోన్న రవాణాశాఖ ఆదాయం

author img

By

Published : Aug 8, 2020, 5:59 AM IST

లాక్‌డౌన్‌ ప్రభావంతో కుదేలైన రవాణాశాఖ ఆదాయం..శ్రావణ మాసం సెంటిమెంట్‌తో తిరిగి పుంజుకుంటోంది. వాహన కొనుగోళ్లు పెరగడంతో..రవాణాశాఖ తిరిగి కాస్త ఆదాయాన్ని చూస్తోంది. ఇదే సమయంలో కొనుగోలుదారులు ఇబ్బందిపడకుండా రవాణాశాఖ ఆన్‌లైన్‌ సేవలను విస్తృతం చేస్తోంది.

శ్రావణ మాసం సెంటిమెంట్‌... విశాఖలో పెరుగుతోన్న రవాణాశాఖ ఆదాయం
శ్రావణ మాసం సెంటిమెంట్‌... విశాఖలో పెరుగుతోన్న రవాణాశాఖ ఆదాయం
విశాఖలో పెరుగుతోన్న రవాణా శాఖ ఆదాయం

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో రవాణా శాఖ ప్రధాన వనరు. కరోనా వల్ల మార్చి నుంచి జూన్ వరకు ఆదాయం పడిపోయింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత జూన్ ఆఖరు వారం నుంచి వాహన రిజిస్ట్రేషన్లు కాస్త ఊపందుకున్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రావణ మాసం సెంటిమెంట్ కూడా తోడుకావడంతో...కొనుగోళ్లు పెరిగి ఆదాయం పుంజుకుందని అంటున్నారు.

వాహన కొనుగోలుదారులు ఇబ్బందులు పడకుండా రవాణాశాఖ అధికారులు ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నారు. కార్యాలయానికి వెళ్లే పని లేకుండా అంతా ఆన్‌లైన్‌లో సేవలు పొందాలని సూచిస్తున్నారు.

మొబైల్ ద్వారా కూడా అనేక సేవలను ఇంటి నుంచే పొందవచ్చని రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు. ఆన్‌లైన్‌లో చేసే లావాదేవీలు వెంటనే పూర్తి చేసేలా సిబ్బంది కూడా పనిచేస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి:

'విశాఖలో 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.