విశాఖలో ఈనెల 26న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె చేపట్టనున్నారు. సంబంధిత పోస్టర్ను సీఐటీయూ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు విడుదల చేశారు.
కేంద్రం తీసుకొస్తున్న చట్టాలు రైతులు, కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.