ETV Bharat / state

ప్రకృతి అందాలకు నెలవు... వంజంగి కొండలు

విశాఖ జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండ వద్ద.. దట్టమైన మేఘాలు.. మంచుతెరలను చీల్చుకొచ్చే సూర్యుడి బంగారు వర్ణ అందాలు.. పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కారణంగా.. పర్యాటకశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పార్కింగ్‌ సదుపాయం, మరుగుదొడ్లు, నీటి సదుపాయం, రిసార్టుల నిర్మాణం, పర్యాటకుల రక్షణకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

author img

By

Published : Jan 23, 2021, 12:06 PM IST

ప్రకృతి అందాలకు నెలవు...వంజంగి కొండలు
ప్రకృతి అందాలకు నెలవు...వంజంగి కొండలు
ప్రకృతి అందాలకు నెలవు...వంజంగి కొండలు

విశాఖ జిల్లా కలిసి వంజంగి పరిసర ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు రామ్‌ప్రసాద్, డీవీఎం ప్రసాదరెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వంజంగి కొండ మీద రెండు గంటలపాటు ఉండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా కొండ మీదకు చేరుకోవాల్సిన మార్గాలు, ప్రమాదాల బారిన పడకుండా రక్షణపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించారు.

పార్కింగ్‌ పాయింట్లు, మరుగుదొడ్లు ఎక్కడ నిర్మించాలి, నీటి వసతి ఎక్కడ కల్పించాలి, రిసార్టు నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించారు.సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండలను, ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదంచేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పర్యాటకులు తాకిడి పెరుగుతుండంతో పర్యాటకశాఖ కొత్త పర్యాటక ప్రాంతంగా గుర్తించింది.

ఎలా చేరుకోవాలి....

ఈ పర్యటక ప్రాంతానికి చేరుకోవాలంటే విశాఖ నుంచి పాడేరు, అరకు మీదుగా వంజంగి అనే గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి మరో 12 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ కొండ ప్రాంతాన్ని చేరుకునేందుకు ప్రధానంగా మూడు బేస్‌ పాయింట్లు ఉన్నాయి. మొదటి బేస్‌పాయింట్‌ వద్ద వాహనాలను నిలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అక్కడి నుంచి కొంత దూరం నడిచాక వచ్చే మరో బేస్‌పాయింట్‌ వద్ద పర్యాటకులు గుడారాల్లో నిద్రపోవచ్చు. మూడో పాయింట్‌ వద్దకు చేరుకొని కొంత దూరం ప్రయాణిస్తే పర్వత పాదానికి చేరుకుంటారు. అక్కడ ప్రయాణిస్తున్న సమయంలో ఒకవైపు లోయలు, మరోవైపు అడవి, ఈతమొక్కలతో ఉండే కొండలు కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. రహదారులు అధ్వానంగా ఉన్నాయి. అయినా... పర్యాటకులు కష్టపడి అక్కడికి చేరుకుంటున్నారు. ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నారు.

ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నాం..

వంజంగి కొండను సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు పర్యాటక అధికారి రామ్ ప్రసాద్ తెలిపారు. రోజూ ఎంతమంది సందర్శకులు వస్తున్నారు. పర్యాటకుల కోసం చేపట్టే సత్వర చర్యలపై నివేదికలు రూపోందిస్తున్నామని ఆయన అన్నారు. రాత్రిళ్లు పోలీసు పరంగా రక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. చాలా చోట్ల దారులు ప్రమాదకరంగా ఉన్నాయని వాటికి మరమ్మత్తుల చేపట్టాల్సి ఉందని చెప్పారు.

ఇదీ చదవండి:

27 నుంచి గుంటూరు - రాయ‌గ‌ఢ్ మధ్య ప్ర‌త్యేక రైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.